నీళ్లు బాగా త్రాగితే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసిన విషయం. కానీ నీళ్లు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. అలా కాకుండా నిలబడి త్రాగితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని చాలా మందికి తెలియదు. ఇలా తాగితే ఆరోగ్య పరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు.
ఇలా తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి.
జీర్ణాశయ గోడలు దెబ్బతింటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం కూడా తగ్గుతుంది.