Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ మునిగిపోతుందా? ప్రమాదకర స్థాయిలో యమునా నది!

ఢిల్లీ మునిగిపోతుందా? ప్రమాదకర స్థాయిలో యమునా నది!
, సోమవారం, 19 ఆగస్టు 2019 (10:50 IST)
దేశ రాజధాని ఢిల్లీ మునిగిపోయే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఉండటమే. ప్రస్తుతం ఈ యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు భయంతో వణికిపోతున్నారు. 
 
ఉత్తర భారతదేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. ముఖ్యంగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కారణంగా యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. 
 
యమునా ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా, డేంజర్ లెవల్ మార్క్ 204.50 మీటర్లు. సోమవారం ఉదయం లెక్కల ప్రకారం ఇది 204.70 మీటర్ల వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. గంట గంటకు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ప్రారంభించి, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలవంతపు వివాహం చేసి.. ఆపై వ్యభిచారం చేయిస్తున్న తల్లిదండ్రులు