Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో మంట... ఏముందిలే అని వదిలేస్తే...?

పొట్టలో గ్యాస్, నొప్పి, మంట... ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఏదో ఒకటిరెండుసార్లు ఇలాంటి సమస్యలు ఎదురయితే ఫర్వాలేదు కానీ తరచూ ఇబ్బంది వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలా కడుపు నొప్పి వస్తుందో చెక్ చేసుకో

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (20:10 IST)
పొట్టలో గ్యాస్, నొప్పి, మంట... ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఏదో ఒకటిరెండుసార్లు ఇలాంటి సమస్యలు ఎదురయితే ఫర్వాలేదు కానీ తరచూ ఇబ్బంది వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.
 
* ఎలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలా కడుపు నొప్పి వస్తుందో చెక్ చేసుకోవాలి. ఆ పదార్థాలను గమనించాక వాటికి కొంతకాలం దూరంగా వుండాలి. అప్పుడు సమస్య తగ్గిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుని దృష్టికి తీసుకెళ్లాలి.
 
* జీర్ణ సంబంధమైన సమస్యలుంటే స్వల్పంగా ఆహారం నాలుగైదు సార్లు తీసుకోవడం మంచిది. ఆహారం నోట్లో వేసుకుని ఎక్కువసేపు నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల తినే ఆహారం సుళువుగా జీర్ణమవుతుంది. 
 
* జీర్ణసమస్యలతో సతమతమయ్యేవారు ఆహారాన్ని వేగంగా తినడం మానుకోవాలి. ఇలా చేస్తే గాలి లోపలికి వెళ్లి గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అలాగే కూల్ డ్రింక్సుకు స్వస్తి చెప్పాలి. 
 
* తిన్న వెంటనే కొందరు వ్యాయామం చేస్తుంటారు. ఇలాంటి అలవాటును మానుకోవాలి. ఐతే వారంలో మూడుసార్లు ప్రాణాయామం చేయడం మంచిది. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. 
 
* ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు బయటి ఆహారానికి దూరంగా వుండాలి. మంచినీళ్లు సైతం ఇంట్లోవే తాగడం మంచిది. అలా కాకుండా బయటవి తీసుకుంటే ఉదర సమస్య తిరగబెట్టడం ఖాయం. ఇలా ఉదర సమస్యలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటిని దూరం చేసుకోవాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రంగనాథ్ ప్రకటన

ములుగు జిల్లాలో కాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments