Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగార శక్తిని పెంచే పూలు ఏమిటో తెలుసా?

ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. మానవుని జీవితంలో సగం దాంపత్యానికే కేటాయించబడుతుంది. ఈ దాంపత్య జీవితం సుఖమయంగా, సాఫీగా సాగేందుకు కొన్ని రకాల, రంగుల పుష్పాలు ఎంతగాన

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (19:20 IST)
ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. మానవుని జీవితంలో సగం దాంపత్యానికే కేటాయించబడుతుంది. ఈ దాంపత్య జీవితం సుఖమయంగా, సాఫీగా సాగేందుకు కొన్ని రకాల, రంగుల పుష్పాలు ఎంతగానో దోహదపడతాయి. 
 
పింక్ పూలతో శృంగార శక్తి డబుల్: పింక్ కలర్ పూలకు పడకగదిలో చోటిస్తే దంపతుల్లో శృంగారం రెట్టింపవుతుందట. ఊదా రంగు పూలకు హృదయాలను స్పందింపజేసే శక్తి, రొమాంటిక్ ఆలోచనలు రేపే లక్షణం ఉంది. కనుక బెడ్రూంలో ఈ పూలకు స్థానం కల్పిస్తే సుఖసాంసారం సొంతం.
 
ఆహ్లాదమైన సాయంత్రపు వేళల్లో రోజా: రోజా పూల గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితా సాయంత్రపు వేళల్లో ఆహ్లాదంగా, ఆనందంగా గడపేందుకు ఎర్రెర్రని రోజాపూలు ఎంతగానో దోహదపడతాయి. ఈ పూలకు ఇంట్లో హాలులో స్థానాన్ని కల్పిస్తే మీ ఇంటికి వచ్చేవారికీ, మీకూ ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. 
 
అనారోగ్యాన్ని తరిమేసే పసుపు, నారింజ పూలు: అనారోగ్యంగ ఉన్నవారిలో సత్తువ, శక్తిని రేకెత్తించడానికి పసుపు, నారింజ రంగు పూలు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా అనారోగ్యంతో సతమతమవుతున్నవారిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఈ రంగుపూలతో కూడిన చిన్న బొకేను ఇస్తే వారికి స్వాంతన చేకూర్చినట్లవుతుంది. 
 
పుట్టినరోజు వేడుకలకు అనేక పువ్వుల కలబోత: పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు మీకు అత్యంత ఇష్టమైన పలు రకాల పువ్వులను కలిపి అందిస్తే సంతోషం రెట్టింపవుతుంది. డబ్బు, ఇతర బహుమతులతో రానటువంటి సంతోషం పువ్వులతో వస్తుంది కనుక ఆయా సందర్భాల్లో పూలను ఉపయోగిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

Kerala: నాలుగేళ్ల కుమారుడిని చిరుత దాడి నుంచి కాపాడిన తండ్రి

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

తర్వాతి కథనం
Show comments