Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముప్పుతిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి.. జయించేదెలా?

హైటెక్ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా బీపీ, షుగర్‌ ముప్పు తిప్పలు పెడుతున్నాయి.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (10:42 IST)
హైటెక్ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా బీపీ, షుగర్‌ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇవి చివరకు బ్రెయిన్‌ స్ట్రోక్‌కూ దారితీస్తున్నాయి. పక్షవాతం అంటే వయస్సు పైబడిన వారికే వస్తుందని గతంలో అనుకునేవారు. కానీ, ఇపుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యుక్తవయసు వారికీ వస్తోంది. అంతేనా, మానసిక, పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యంబారిన పడుతున్నారు. ఒత్తిడి జయించి, బ్రెయిన్ స్ట్రోక్‌కు దూరంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని...
 
* రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు. 
* రోజూ దూర ప్రయాణం చేయడం మానుకోవాలి. 
* మానసిక ఒత్తిడికిగురయ్యే పనులకు దూరంగా ఉండాలి.
* ఆఫీసులో అరగంటకుపైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు. 
* కూర్చుని పనిచేసే వారు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. 
* కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ సమయం కేటాయించుకోవాలి. 
* నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతోపాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది.
* తలవెనుక భాగంలో తరుచూ నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి. 
* రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. 
* అధిక బరువు, హైపర్‌టెన్షన్‌, మధుమేహం వంటి సమస్యలుంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
* ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వుపదార్థాలు, పిండి పదార్ధాలను తగ్గించాలి. మంచి సంగీతం వినాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments