నువ్వులు, తేనెతో పొట్ట వద్ద కొవ్వు కరిగిపోతుంది.. (video)

మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (17:32 IST)
మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

వీటిని తీసుకోవడం ద్వారా మహిళల్లో ఎముకలకు సంబంధించిన నొప్పులను దూరం చేసుకోవచ్చు. తద్వారా మహిళల్లో వెన్నునొప్పి వంటి సమస్యలుండవు. ఎదిగే పిల్లలకు కూడా తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. 
 
మహిళలు నువ్వుల పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఒక స్పూన్ తేనెతో రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. 
 
ఇలా నువ్వులు-తేనె కలిపి తీసుకోవడం ద్వారా రోజంతా చురుగ్గా వుంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపులు పోతాయి.

నొప్పులు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments