Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లంగి సలాడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (21:54 IST)
ముల్లంగి అనగానే ఎక్కువమంది ఇష్టపడరు. కానీ ముల్లంగిలో అనేక రకములైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. పలురకాల విటమిన్స్ కూడా ముల్లంగిలో ఉన్నాయి.మనకు ఆరోగ్యం సరిగా లేకపోతే ఇష్టం లేకపోయినా మందులు వేసుకుంటాము. అలాగే ముల్లంగిని కూడా మన ఆరోగ్యం కోసం మన ఆహారంలో చేర్చుకోవలసిందే మరీ. మరి ముల్లంగిలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం.
 
1. మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది.
 
2. రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. తెల్ల రక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
 
3. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి. దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా అధిక కఫాన్ని నియంత్రిస్తుంది.
 
4. ముల్లంగి రక్తంలోని వ్యర్థాలను తొలగించి... రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది.
 
5. ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి.
 
6. ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి.
 
7. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments