Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైనీ టిప్స్ : ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు...

రైనీ టిప్స్ : ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు...
, బుధవారం, 21 నవంబరు 2018 (13:47 IST)
చలికాలంలో జలుబు, దగ్గు అనేవి సర్వసాధారణం. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో పాటు చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వీటికి కారణంగా చెప్పొచ్చు. అయితే, ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకున్నట్టయితే చిన్నపాటి అనారోగ్యాలబారిపడకుండా జాగ్రత్తపడొచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
అల్లం : తేనెతో కలిపి అల్లం ముక్కలనుగానీ, అల్లం రసంనుగానీ రోజూ తీసుకున్నట్టయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిదేరవు. జీర్ణశక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. 
 
పసుపు : రాత్రిపూట నిద్రపోయే ముందు పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగాలి. జలుబు దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోవడమేకాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
 
ఖర్జూరం : వీటిలో కొవ్వు తక్కువ మోతాదులో, పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఖర్జూరం నివారిస్తుంది. 
 
డ్రైఫ్రూట్స్ : ఎక్కువ వేయించిన ఆహార పదార్థాలు, కూరలు జీర్ణాశయం పనితీరుపై ప్రభావితం చూపిస్తాయి. డ్రైఫ్రూట్స్‌ను స్నాక్స్‌గా, ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిలకడ దుంపని పేస్టులా చేసి పాలలో కలుపుకుని తాగితే...