Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడిగుడ్డు ఉదయంపూట తింటే ఏమవుతుంది?

కోడిగుడ్డు ఉదయంపూట తింటే ఏమవుతుంది?
, శనివారం, 10 నవంబరు 2018 (21:00 IST)
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ గుడ్డు పౌష్టికాహారమన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇది కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు తేలికగా జీర్ణము కాదు గనుక తొందరగా ఆకలివేయదు. గుడ్డు తీసుకోనడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
  
 
1. గుడ్లు చాలా చవకైన పోషకాహారం. ఎప్పుడంటే అప్పుడు తినటానికి వీలుగా ఉంటాయి కూడా. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు మెండుగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిది.
 
2. గుడ్లలో విటమిన్‌ డి ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముక జబ్బుల వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది.
 
3. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
 
4. మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయం జబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం.
 
5. ఉదయం పూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆకలి వేయకుండా చూస్తూ.. ఎక్కువెక్కువ ఆహారం తినకుండా చేస్తాయి. ఇలా బరువు తగ్గటానికీ గుడ్లు తోడ్పడతాయన్నమాట.
 
6. ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్లు వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్‌ స్థాయిలు మెరుగుపడతాయి. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఇవి రెండూ గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..