Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలే పరీక్షలు... మీ పిల్లలకు సూపర్ ఫుడ్స్... ఇదే

విద్యార్థుల్లో శరీర పెరుగుదలకు ప్రోటీన్స్ ఎంతో ముఖ్యమైనవి. ఇదివరకు రోజుల్లో విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టినదేదో తిని కనీసం రెండు గంటలైనా ఆడుకునేవారు. తరువాత హోంవర్క్ చేసుకుని భోజనం చేసి ప్రశాంతంగా పడుకునేవారు. అప్పట్లో పిల్లలు చాలావరక

అసలే పరీక్షలు... మీ పిల్లలకు సూపర్ ఫుడ్స్... ఇదే
, గురువారం, 15 ఫిబ్రవరి 2018 (22:12 IST)
విద్యార్థుల్లో శరీర పెరుగుదలకు ప్రోటీన్స్ ఎంతో ముఖ్యమైనవి. ఇదివరకు రోజుల్లో విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టినదేదో తిని కనీసం రెండు గంటలైనా ఆడుకునేవారు. తరువాత హోంవర్క్ చేసుకుని భోజనం చేసి ప్రశాంతంగా పడుకునేవారు. అప్పట్లో పిల్లలు చాలావరకు ఆరోగ్యంగా ఉండేవారు. ఊబకాయంతో ఉండే పిల్లలు చాలా తక్కువగా ఉండేవారు. 
 
ప్రస్తుత కాలంలో పిల్లలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో, ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం. స్కూలుకి వెళ్లే పిల్లలకు పెట్టే ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు, ఖనిజలవణాలు, పీచుపదార్థాలు, రోగనిరోధకశక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు కావలసిన పదార్థాలను ఉండేలా చూసుకోవాలి. మనం పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. చదువు సాఫీగా సాగుతుంది.
 
1. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్
పిల్లలలో శరీర పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, గాయాలు త్వరగా తగ్గాలన్నా ప్రోటీన్స్ ఉండే ఆహారం పెట్టాలి. కోడిగుడ్లు, పప్పుదినుసులు, మొలకెత్తిన విత్తనాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్బోహైడ్రేట్స్ అంటే పిండిపదార్థాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండిపదార్థాలు విద్యార్థులకు గ్లూకోజ్‌లా పని చేస్తాయి. చిరుధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటివల్ల ఇవి సమృద్ధిగా లభిస్తాయి.
 
2. గుడ్లు
కోడిగుడ్డు పిల్లలకు ఎంతో ఆరోగ్యప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలామంచిది. వందశాతం పౌష్టికాహారం లభించేది గుడ్డులోనే అనే విషయం చాలామందికి తెలియదు. 11 రకాల ఆమ్లాలు గుడ్డులోనే లభిస్తాయి.
 
3. కొవ్వుపదార్దాలు
కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్న, నెయ్యి, పల్లినూనె, గింజలు తీసిన వంటనూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి ఎముకలకు రక్షణగా నిలుస్తుంది. మూత్రపిండాలు, గుండెలాంటి వాటికి రక్షణ కవచాల్లా ఉంటాయి.
 
4. మొలకెత్తిన విత్తనాలు
వీటిని తినడం చాలా మంచిది. వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పెసర్లు, శనగలు, రాగులు, పల్లీలు, కర్జూరా. వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసరికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతిరోజు పిల్లలకు తినిపించాలి. వీటితో విటమిన్లు, పోషకపదార్థాలు లభిస్తాయి.
 
5. అయోడిన్
అయోడిన్ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్ తక్కువ అయితే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీనితో విద్యార్థులు చదువుతున్నప్పటికి వాటిని గుర్తించుకోలేకపోతారు. కాబట్టి చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలు బాగా తినిపించాలి. అయోడిన్, ఐరన్ కలిసిన ఉప్పు మార్కెట్లో లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిదండ్రుల తృప్తి కోసమే తెలుగు అమ్మాయిలు... ఎన్నారై అబ్బాయిల వరస ఇదీ...