Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వును నియంత్రించే గుమ్మడి... ఎలా తీసుకోవాలంటే?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (19:40 IST)
మనం నిత్యం అనేక రకాల కూరగాయలను తింటాము. వాటిల్లో అనేక రకములైన పోషకాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిల్లో గుమ్మడికాయ ఒకటి. ప్రస్తుతకాలంలో ఎక్కువమంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యను తగ్గించడంలో గుమ్మడికాయ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలో పీచు పదార్దము ఎక్కువగా ఉండటం వలన అధిక కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుమ్మడికాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. 
 
1. ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. 
 
2. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
 
3. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. 
 
4. వీటిలో మెగ్నీషియం మెండుగా వుంటాయి. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట. 
 
5. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ ఔషదంలా పని చేస్తుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ అవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. 
 
6. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడటం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
7. గుమ్మడికాయలో చాల ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది. అంతేకాకుండా కళ్ళకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కుడా సంమృద్దిగా లభిస్తుంది. 
 
8. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

మధ్యతరగతి సమస్యలపై ఈశ్వర్ కథతో సూర్యాపేట్‌ జంక్షన్‌ ట్రైల‌ర్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments