Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావిచెట్టు ఆకులతో వైద్యం, ఉబ్బసం-ఆస్తమా తగ్గుతాయి

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (22:55 IST)
రావిచెట్టు ఆకులు గాయాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఆకులను వేడి చేసి గాయాలపై పూస్తే గాయాలు చాలా త్వరగా మానుతాయి. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు, తాజా రావి ఆకుల రసాన్ని ముక్కులో వేయాలి. దాంతో ముక్కు నుండి రక్తస్రావం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

 
చర్మం పైన ముడతలు నివారణ యాంటీ ఆక్సిడెంట్లు రావిచెట్టు వేళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. దీని వేర్ల చివర్లను కోసి నీళ్లలో నానబెట్టి గ్రైండ్ చేసి, దాని పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే ముడతలు మాయమవుతాయి. ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు కనిపించవు.

 
10 గ్రాముల రావిచెట్టు బెరడు, కాచుతుమ్మ, 2 గ్రాముల ఎండుమిర్చి మెత్తగా నూరి, క్రమం తప్పకుండా బ్రష్ చేస్తూ వుంటే దంతాలు కదలడం, నోటి దుర్వాసన మొదలైన సమస్యలేవీ ఉండవు. అలాగే ఉబ్బసం తగ్గేందుకు రావి బెరడు బాగా మేలు చేస్తుంది.  బెరడు లోపలి భాగాన్ని తీసి ఎండబెట్టి, మెత్తగా రుబ్బి దాని పొడిని ఆస్తమా రోగికి ఇస్తే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది.

 
పాదాల మడమలు పగిలినప్పుడు రావి ఆకుల పాలను పూయడం ద్వారా కొన్ని రోజులలో పగిలిన మడమలు సాధారణమవుతాయి. నాలుగైదు రావి బెరడుతో కషాయాలను తయారు చేసి, అరకప్పు తాగితే, రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments