Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్తిగా పండని మామిడి పండును తింటే...?

పూర్తిగా పండని మామిడి పండును తినటంవల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇలాంటి పండును తినటం వల్ల శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి వల్ల ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలను రాకుండా శరీరంలో రోగన

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (22:53 IST)
పూర్తిగా పండని మామిడి పండును తినటంవల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇలాంటి పండును తినటం వల్ల శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి వల్ల ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలను రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది.
 
పండిన మామిడి పండు రసాన్ని ఒక గ్లాసుడు పాలల్లో వేసి, రోజుకు మూడుసార్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఓ నెల రోజులపాటు తీసుకోవటంవల్ల.. వయసుకు తగినంత బరువులేనివారు క్రమంగా బరువు పెరుగుతారు. దీంతోపాటు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.
 
తాజా మామిడి ఆకులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ప్రతిరోజూ తాగటంవల్ల డయాబెటీస్ (చక్కెర వ్యాధి)ని అరికట్టవచ్చు. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ మామిడి ఆకులను నానబెట్టిన నీటితో చక్కటి పరిష్కారం లభిస్తుంది.
 
పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కళంగా లబిస్తుంది. దీనివల్ల జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments