లండన్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం...

లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం, JET UK సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 800 మంది భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, శాంతి మంత్రంతో ప్రారంభించి, ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో శ్రీ రాముల వారి

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (19:14 IST)
లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం, JET UK సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 800 మంది భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, శాంతి మంత్రంతో ప్రారంభించి, ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో శ్రీ రాముల వారిని, సీతమ్మ వారిని తీసుకు వచ్చి కళ్యాణం ప్రారంభించారు. 
 
లండన్‌లో మొదటిసారిగా 80 కుటుంబాలు స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ గారి మఠం నుండి వచ్చిన శ్రీ రామాచార్య అయ్యగారి ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. కల్యాణానంతరం అన్నమాచర్య కీర్తనలు, భక్తి పాటలు సాంప్రదాయక నృత్యాలు, రామాయణంపై క్విజ్ పోటీలు, చిన్నారుల ఆట, పాటలతో ఘనంగా నిర్వహించారు. 
 
భారత సంతతికి చెందిన లండన్ MP   సీమా మల్హోత్రా గారు స్వామివారి కళ్యాణంలో పాల్గొని తమను కళ్యాణంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదము తెలిపారు. భగవాన్ శ్రీ రామానుజాచార్య 1000వ జయంతి ఉత్సవాలపై ప్రజెంటేషన్ ఇచ్చి భగవాన్ శ్రీ రామానుజాచార్య చరిత్రను తెలిపారు. శ్రీ సీతా రాముల వారిని పల్లకి ఊరేగింపుతో కార్యక్రమం ముగింపు చేశారు. క్విజ్‌లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో TELANGANA NRI FORUM సభ్యులు JET UK ట్రస్టీ మరియు JET UK సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేసారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments