Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లజుట్టు నల్లగా మారుతుంది... ఎలా?

ఈ రోజులలో చాలామంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారిని ఈ సమస్య బాధిస్తుంది. దీనికి వంశపారంపర్యం ఒక కారణమైతే, థైరాయిడ్, అధిక వత్తిడి, ఆందోళన, మరొక కారణం. ముఖ్యంగా చిన్నపిల్లలలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ స

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (22:00 IST)
ఈ రోజులలో చాలామంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారిని ఈ సమస్య బాధిస్తుంది. దీనికి వంశపారంపర్యం ఒక కారణమైతే, థైరాయిడ్, అధిక వత్తిడి, ఆందోళన, మరొక కారణం. ముఖ్యంగా చిన్నపిల్లలలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య ఎదురౌతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఇలా చేయాలి.
 
1. ఎప్పుడూ ఒకే రకమైన షాంపూలను మాత్రమే వాడాలి. 
 
2. పాలు,గుడ్లు, సోయాబీన్స్, మెులకెత్తిన విత్తనాలు, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువుగా తీసుకొనటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
3. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా కరివేపాకు లేదా మెంతి ఆకువేసి మెత్తగా పేస్టు చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
 
4. ఐదు టీస్పూన్ల ఉసిరిపొడి, 2 టీస్పూన్ల గోరింటాకు పొడి, 2 టీస్పూన్ల మిరియాల పొడి, 2 టీస్పూన్ల టీ పొడి, 2 టీ స్పూన్ల నువ్వుల పొడి తీసుకొని దానికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీనిని రాత్రిపూట తయారుచేసి ఉదయానే 5 నిమిషాలపాటు సన్నటి సెగపై వేడి చేయాలి. తర్వాత దానిని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
 
5. మందార ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసి దానికి కొబ్బరి నూనెను కలిపి తలకు రాయాలి. ఒక గంట తర్వాత శుభ్రంగా కడిగేసి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
6. ఆముదంలో హెన్నా పౌడర్ వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు పూసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే నల్లటి జుట్టు సొంతం అవుతుంది. 
 
7. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కాఫీ పొడిని వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు బాగా మర్దన చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

తర్వాతి కథనం
Show comments