Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీ పండు తింటే కాంతివంతంగా వుంటారు...

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:50 IST)
తక్కువ వయస్సులోనే చాలామంది వయసు పైపడినట్లు కనిపిస్తుంటారు. తీసుకునే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడటం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. 
 
అయితే యాంటీఏజింగ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మంపై ముడతలు, చర్మం వదులుగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
1. కివీ పండు విటమిన్-సితోపాటు యాంటీ ఆక్సిడెంట్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం మీద ముడతలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
 
2. తరచుగా దానిమ్మ గింజలు మరియు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇది చర్మ కణాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. దానిమ్మ చర్మాన్ని బిగుతుగా మార్చే యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది మీ చర్మానికి కావలసిన పోషణను అందించి అందం, మంచి గ్లోయింగ్ వచ్చేలా సహాయపడుతుంది.
 
3. పుచ్చకాయ చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. ఇది చర్మానికి కావలసిన తేమను అందించి డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. పుచ్చకాయ గింజల్లో కూడా చర్మ సౌందర్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
 
4. ద్రాక్ష కూడా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వయసు పెరగడం వలన వచ్చే చర్మ లక్షణాలను తగ్గిస్తుంది.
 
5. యాపిల్‌లో చర్మం ముడతల సమస్యను ఎదుర్కొనే లక్షణాలు అధికంగా ఉన్నాయి. తరచుగా యాపిల్‌ని తిన్నా లేదా యాపిల్ గుజ్జును చర్మానికి అప్లై చేసుకున్నా వృద్దాప్యపు గుర్తులను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉన్న పోషకాలు మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments