Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్లెపువ్వుతో ఎంత ఆరోగ్యమో తెలుసా..?

మల్లెపువ్వుతో ఎంత ఆరోగ్యమో తెలుసా..?
, సోమవారం, 9 డిశెంబరు 2019 (20:39 IST)
మల్లెపూలను తలలో పెట్టుకుంటారు. దీనివల్ల మల్లె ఔషధ గుణాలు జుట్టు రాలకుండా తలలో పుండ్లు ఏర్పడకుండా, సూక్ష్మక్రిములు చేరకుండా కాపాడుతుందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా జుట్టుకి కావాల్సిన పోఫషక విలువలు అందించి జుట్టు పొడవుగా పెరగడానికి దోహడపడుతుందట. 
 
శరీర బడలికని తీర్చి, ప్రశాంతమైన నిద్రనిస్తుందట. ఈ పువ్వులు శుభకార్యాల్లో అధికంగా వినియోగిస్తుంటారు. మల్లెపూలతో చేసిన మల్లె టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదట. చైనాలో ఈ టీని ఎక్కువగా వినియోగిస్తారట.
 
బ్రెడ్లు, చాక్లెట్ల తయారీలో ఈ మల్లె రసాన్ని వాడతారు. యుఎస్ఎలో వీటి ఆకులు, బెరడుతో టీ తయారు చేసుకుంటారట. మల్లె శరీంరలోని సూక్ష్మక్రిమి సంహారిగా అద్భుతంగా పనిచేస్తుందట. సుఖ రోగాలకి, పచ్చ కామెర్లకి, దివ్యౌషధంగా పనిచేస్తుందట. అనేక వ్యాధులకి ఎంతగానో మల్లె పువ్వు దోహదపడుతుందట. మల్లె ఆకులలో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి బాగా ఉపయోగిస్తారట. 
 
మల్లె చమురు బడలిక తీర్చుకోవడానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందట. మనం నిత్యం వాడే ఫేస్ క్రీముల్లో, షాంపూల్లో సబ్బులో కూడా వీటిని వాడతారు. దోమల నివారణ కోసం తయారుచేసే కాయల్స్, రూం ఫ్రెషనర్లు తయారీలో కూడా వాడతారని వైద్య నిపుణులు చెబుతున్నానరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో పచ్చిమిర్చిని పక్కనబెట్టకూడదట..