Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పరిస్థితుల్లో ఆ కాయ రసం తాగితే...

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:06 IST)
ఒకవైపు కరోనా వైరస్ కల్లోలం. ఇంకోవైపు మండే ఎండలు. ఈ పరిస్థుతుల్లో ఈ వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా వేసవిలో శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది కనుక నీటి నిల్వలున్న పండ్లను తీసుకోవాలి. ఇలాంటి వాటిలో కీర దోస ఒకటి. ఇది రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. 
 
పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవశ్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఇవేకాకుండా కీలదోసలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది .. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది.
 
2. వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసం తో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది. 
 
3. కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్ధరైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుంది. 
 
4. కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును , కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.
 
5. శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
6. దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
7. దోస తొక్కలో విటమిన్ కె సమృద్ధిగా ఉన్నందున చర్మానికి మేలు చేకురుతుంది. అంతేకాకుండా దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. 
 
8. తీవ్రమైన ఎండ వలన చర్మము కమిలిపోతుంది. అప్పుడు కీరదోసకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. కీరదోసకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments