మునగాకు లేత చిగుళ్లు పసుపు పచ్చగా మెరుస్తుంటాయి. వీటితో అనేక వంటకాలు చేసుకోవచ్చు. తోటకూరలాగా, పప్పు పులుసు, పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే వాత వ్యాధులన్నిటిలోనూ ఔషధంలా పనిచేసి నొప్పులు, పోట్లు తగ్గిస్తాయి.
కడుపులో పైత్యం, మంట, గ్యాస్, వేడిని తగ్గిస్తుంది. కడుపులోని పాములను వెళ్లగొట్టేందుకు సహకరిస్తుంది. కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కళ్లకు మేలు చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం కొవ్వును కరిగించి, పొట్ట తగ్గించేందుకు స్థూలకాయం తగ్గేందుకు తోడ్పడతాయి.
గుప్పెడు లేత మునగ చిగుళ్లను నీటిలో వేసి రసం పొడి కలిపి కమ్మని చారును కాసుకుని ప్రతి ఉదయం రాత్రి ఒక్కో గ్లాసు చొప్పున తాగండి లేదా అన్నంలో తినండి. చాలా కమ్మటి ఆహార పదార్థం మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, స్థూలకాయం ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.