ఈ జామకాయలు తింటే అవన్నీ తగ్గిపోతాయ్...

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (20:27 IST)
జామపండ్లలో సి, ఎ, బి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. ప్రతిరోజూ జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
 
జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి మనల్ని బాధించవు.
 
జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు వీటిలో అధికంగా ఉంటాయి. ఊబకాయంతో బాధపడేవారు కూడా రోజూ జామపండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇంట్లో వుండి పనిచేస్తున్నారా? వాటి జోలికెళ్లొద్దు..? (video)