Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Advertiesment
బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:36 IST)
ఔషధ గుణాలను మిళితం చేసుకున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే "కెరోటిన్" అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి.
 
బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. క్యారెట్, బీట్‌రూట్, ముదురాకు పచ్చని ఆకుకూరలు, మునగాకు, పాలకూర, కరివేపాకు లాంటి వాటిలో కంటే బొప్పాయిలో "అస్కార్బిక్ ఆసిడ్" (విటమిన్ సి) ఎక్కువగా లభిస్తుంది.
 
ఇంకా కాల్షియం, థయామిన్, రిబోప్లావిన్, నియాసిన్ విటమిన్లు కూడా బొప్పాయిలో ఉంటాయి. ఇందులో సోడియం కేలరీలు తక్కువగానూ, పొటాసియం ఎక్కువగానూ లభిస్తాయి. పచ్చి బొప్పాయి నుంచి తెల్లని పాల వంటి రసం స్రవిస్తుంది. దాన్నే 'పాపైన్' అని అంటారు. ఈ ఎంజైమ్ వల్ల జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది 'అనిమల్' ఎంజైమ్ అయిన పెప్సిన్‌ను పోలి ఉంటుంది. అజీర్ణం తగ్గించేందుకు తయారు చేసే పలు రకాల మందుల్లో కూడా వీటి రసాన్ని వాడుతారు. 
 
చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల ఈ బొప్పాయి చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు, చక్కటి ఆహార నియమాలను పాటించే వారికి చెప్పుకోదగ్గ మంచి ఆహారం అని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఓ బొప్పాయి పండు తింటే స్థూలకాయం బాగా తగ్గిపోవడమే గాకుండా, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. బాగా ముదిరిన మాంసాన్ని మెత్తగా ఉడికించేందుకు కూడా బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరం రోగనిరోధక శక్తిని సంతరించుకోవాలంటే?