పిస్తా పప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మనకు మార్కెట్లో దొరికే డ్రై ప్రూట్స్‌లో పిస్తాపప్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకములైన ఔషద గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక రకములైన పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇది రక్తంలోని హిమో

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (20:26 IST)
మనకు మార్కెట్లో దొరికే డ్రై ప్రూట్స్‌లో పిస్తాపప్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకములైన ఔషద గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక రకములైన పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. పిస్తా పప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 
1. ఇది శరీరంలోని ఊపిరితిత్తులకు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
2. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
3. పిస్తాపప్పు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ని పెరిగేలా చేస్తుంది. అందువల్ల గుండె జబ్బుల సమస్యలు తగ్గుతాయి. ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
4. రోజూ పిస్తాను తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. అంతేకాకుండా కంటి సమస్యలతో బాధపడేవారికి పిస్తా మంచి ఫలితాన్నిస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్లు కంటిలోని కణాలను పునరుద్ధరించి కంటిచూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
 
5. ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ బి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర  పోషిస్తాయి. ఇది శరీరాన్ని అనేక శారీరక రుగ్మతల నుండి దూరం చేస్తుంది. శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోన ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాతంగానే ఉంటుంది : డోనాల్డ్ ట్రంప్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికులకు తప్పిన ముప్పు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments