చికెన్ సూప్ తీసుకుంటే జలుబు తగ్గిపోతుందా?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (18:48 IST)
తుమ్ములతో ముక్కు కారిపోతూ ఉంటే చికెన్ సూప్ కంటే మించింది లేదని కొందరు చెపుతారు. మరికొందరు అల్లం, తేనె కలిపిన టీ, నిమ్మకాయ పనిచేస్తుందంటారు. అయితే సాధారణ జలుబు అయినా దానిపట్ల మరింతగా శ్రద్ధ వహించవలసిందే. 
 
తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు. 
 
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెపుతారు. 
 
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?

ఖమేనీ మృతిపై ప్రియాంకా మండిపాటు - కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది...

అశ్లీల వీడియోపై తితిదే చైర్మన్ వివరణ.. సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు (వీడియో)

చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు.. ట్రంప్ ప్రకటన

ఆ వీడియోలో వున్నది నేను కాదు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసా: తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments