బీట్‌రూట్ తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (23:19 IST)
బీట్రూట్ దుంపల్లో చాలా పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలతో నిండి ఉన్నాయి. ఇవి మెదడు, గుండె, జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యానికి తోడ్పడతాయి. సమతుల ఆహారానికి గొప్ప వనరుగా వీటిని చెపుతుంటారు. అలాగే కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తాయి.

 
బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. 

 
బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.

 
బీట్ రూట్ గురించి పరిశోధన ప్రకారం రోజుకి 400 మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది. బీట్ రూట్‌లో బోరాన్ ఎక్కువగా ఉన్నందు వలన శృంగార హార్మోన్లను ఎక్కువ చేస్తుంది.

 
సౌందర్యానికి విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.

 
రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలను తీసిన పాఠశాల బస్సు, నాన్నతో పాటు బండెక్కారు...

లక్కీ డ్రా పథకం.. కోట్లాది ప్రజాధనం స్వాహా.. అంబటికి బెయిల్ మంజూరు

శబరిమల బంగారు దుర్వినియోగ కేసు.. వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు

అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన.. నారా లోకేష్- పవన్ భేటీ..

పెళ్లయి 3 నెలలే, గడ్డి మందు తాగి టెక్కీ సూసైడ్, కారణం ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. చల్లారని వివాదం

Chiranjeevi: పునాదిరాళ్లు సినిమా కోసం కెమెరా ముందు నిలిచిన తొలి రోజు

ఆనాటి ఆ స్పెషల్ ఆలోచనే టాలీవుడ్ మెగాస్టార్‌ను స్పెషల్ స్టార్‌ను చేసాయ్

Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే

Nikhil: వెయ్యి ఏళ్ల క్రితం చిత్తూరు లోని కృష్ణ అనే వారియర్ కథ స్వయంభు : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments