Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ పని చేస్తే....

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (23:27 IST)
వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలోని నిల్వ ఉంచిన నీటిని తాగడం ఉపకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది.

 
రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం వలన శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుంది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఆహారంగా తీసుకున్న పోషకాలు శరీరానికి అందుతాయి. 

 
గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది. శరీరంలో లోపల, ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి రాగి సహకరిస్తుంది.  వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి్ పాత్రలో నిల్వ ఉంచిన నీరు సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తుంది.

 
క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలతో పోరాడుతాయి. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటంతోపాటు, థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుంది. ఆర్థరైటిస్ రాకుండా, కీళ్ల నొప్పుల బారిన పడకుండానూ ఇది కాపాడుతుంది. చర్మ వ్యాధుల బారిన పడకుండా, రక్తహీనత తగ్గడానికి ఈ అలవాటు ఉపకరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

Andhra Pradesh liquor scam: అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

Telangana: తెలంగాణలో కుమ్మేసిన వర్షాలు.. రాత్రిపూట భారీ వర్షపాతం- కూలిన భవనాలు (video)

అసీం మునీర్‌ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విడాకుల పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ స్కామ్ బట్టబయలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments