Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్‌కు గురియైన రోగికి పసుపు పొడిని, వెల్లుల్లిని కలిపి పేస్ట్ చేసి రాస్తే...

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:43 IST)
పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. పసుపుకొమ్మును నిప్పులపై కాల్చి కొద్దిగా కాలిన పసుపు కొమ్మును నమిలితే పంటిపోటు తగ్గుతుంది, నోరు శుభ్రపడుతుంది, నోట్లో పుళ్ళు వుంటే తగ్గుతాయి. పసుపును కామెర్ల వ్యాధికి వాడతారు. కామెర్ల వ్యాధిలో కళ్ళు, చర్మం, మూత్రం అంతా పసుపురంగులోనే వుంటాయి. అది వ్యాధి లక్షణం. 
 
కప్పు పాలల్లో ఒక పసుపు కొమ్మును ముక్కలుగాచేసి వేసి బాగా మరగకాయాలి. అలా మరగబెట్టిన పాలను ఉదయం, సాయంత్రం రోజూ త్రాగితే క్రమేణా కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అంతేకాదు పసుపుకు నాలుగు రెట్లు పెరుగు కలిపి రోజూ తింటే తగ్గిపోతాయి. 
 
శరీరంలో వున్న విష పదార్థాల్ని వెళ్ళగొట్టే శక్తి పసుపుకు వున్నది. అందుచేతనే దీనిని ఆహారంలో వాడుతారు. పసుపును నిప్పులపైన వేసి పైన వచ్చే పొగను పీలుస్తుంటే తుమ్ములు రావడం, జలుబుతో ముక్కు నుండి నీరు కారడం ఇలాంటి లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి.
 
కాళ్ళు, చేతులు చల్లబడిపోయి - షాక్‌కు గురియైన రోగికి పసుపు పొడిని, వెల్లుల్లిని కలిపి మెత్తగా నూరి అరికాళ్ళకు, అరిచేతులకు రాస్తే రోగి కోలుకుంటాడు. చల్లబడిన శరీరం వేడెక్కుతుంది. పసుపు పొడిని వేడినీళ్ళలో కలిపి పుళ్ళు, గజ్జి కురుపులను కడుగుతూ వుంటే అవి త్వరగా మానతాయి. ఇది యాంటిసెప్టిక్ లోషన్‌గా పనిచేస్తుంది. మడమశూల అనేది ఒక వయస్సు వచ్చిన వారిలో చాలామందిలో వస్తుంది. ఈ సమస్యకు పసుపు పొడి బాగా పనిచేస్తుంది. 
 
ఆడవారికి నెలసరి దోషాల్ని పసుపు తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఐదు గ్రాములకు మించకుండా పసుపును చిన్న మాత్రలుగా చేసుకొని వాడుకోవాలి. ఈవిధంగా నెలసరి అయినప్పుడు వాడుకుంటే ఇతర బాధలు పోతాయి.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments