Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్తానీ మట్టితో కంటి కింద నల్లటి వలయాలకు చెక్

కంటి చుట్టూ నల్లటి వలయాలు ప్రస్తుతం యూత్‌ని వేధించే సమస్యలో ఒకటి. దీనికి ముఖ్య కారణం... సరైన నిద్ర లేకపోవటం, అనారోగ్యం, ఒత్తిడి వల్ల కంటి చుట్టూ నల్లటి చారలు ఏర్పడతాయి. ప్రతిరోజుకు కనీసం 7 గంటల పాటు వ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (09:55 IST)
కంటి చుట్టూ నల్లటి వలయాలు ప్రస్తుతం యూత్‌ని వేధించే సమస్యలో ఒకటి. దీనికి ముఖ్య కారణం... సరైన నిద్ర లేకపోవటం, అనారోగ్యం, ఒత్తిడి వల్ల కంటి చుట్టూ నల్లటి చారలు ఏర్పడతాయి. ప్రతిరోజుకు కనీసం 7 గంటల పాటు విశ్రాంతి తప్పని సరిగా అవసరం. ఈ సమస్యను తగ్గించుకోటానికి తగిన సమయం పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి.

అంతేకాదు..విటమిన్ల లోపం వలన కూడా కంటి చుట్టూ నల్లటి వృత్తాలు ఏర్పడతాయి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కంటి చుట్టూ ఏర్పడే వృత్తాల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి... అవేంటో చూద్దాం...
 
ముల్తానీ మట్టిలో పెరుగు, తేనే కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని కంటి చుట్టూ రాయాలి. పెరుగు తేమను అందిస్తే తేనే అలసిన కళ్ళకు ఉపశమనాన్ని అందిస్తుంది.
 
రోజ్ వాటర్ చర్మం లోపల నుండి పోషణను అందిస్తుంది. రోజ్ వాటర్, ముల్టానా మట్టి కలిసి నల్లటి వలయాల మీద పూతల పూస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
బంగాళదుంపను మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌లో ముల్టానా మట్టి కలిపి కంటి చుట్టూ రాసి 15 నిముషాలు అయ్యాక నిదానంగా కడగాలి. ఈ విధంగా చేస్తే నల్లటి వలయాలు మాయం అవుతాయి. ఈ ప్యాక్‌లను రాత్రి సమయంలో వేసుకుంటే కళ్ళకు తగినంత విశ్రాంతి కలుగుతుంది. 
 
టీ తాగటం వలన కూడా కంటి చుట్టూ ఉండే నల్లటి వృత్తాలు తగ్గిపోతాయి. టీ మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్‌లను అందచేసి, కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగిస్తుంది. వాడిన, చల్లటి టీ బ్యాగులను కొద్ది సమయం పాటు కళ్ళపై ఉంచండి. టీలో ఉండే టానిన్‌లు కంటి చుట్టూ ఉండే చర్మం యొక్క నిర్జీవత్వాన్ని తొలగించి, కళ్ళకు విశ్రాంతిని అందిస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

తర్వాతి కథనం
Show comments