Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోమలను తరిమికొట్టడానికి కొత్త రీఫిల్ కొనొద్దు... త‌యారు చేసుకోండిలా

డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రివేళ జెట్ కాయిల్స్ కాల్చడమో లేక ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్‌ను వాడటమో చేస్తుంటారు. అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యల

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (16:51 IST)
డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రివేళ జెట్ కాయిల్స్ కాల్చడమో లేక ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్‌ను వాడటమో చేస్తుంటారు. అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. పైగా వంద‌లు పోసి రిఫిల్స్ కొన‌లేని ప‌రిస్థితి ఉండొచ్చు. అయితే ఇక మీరు ఆల్ అవుట్, గుడ్ నైట్ రీఫిల్స్ కొనాల్సిన ప‌నిలేదు. మీరే ఆ రీఫిల్ త‌యారుచేసుకుని, ఇంటి మూలల్లో దాగి ఉన్న దోమలను తరిమి కొట్టొచ్చు. దీనికోసం ఆల్ అవుట్, గుడ్ నైట్ పాత రీఫిల్ ఉంటే చాలు.
 
సహజ దోమల నివారిణిని ఎలా తయారు చేయాలి:
Step-1: పాత రిఫిల్స్ ని తీసుకొని వాటి మూతను తీసేయాలి.
Step-2: ఖాళీగా ఉన్న రీఫిల్‌లో మూడు లేదా నాలుగు పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి, అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి. ఈ వేప నూనె ఆయుర్వేద షాప్‌లలో దొరుకుతుంది. 
Step-3: ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి.
Step-4: సాధారణంగా రీఫిల్స్‌ను ఎలా వాడుతామో… అలాగే వీటిని కూడా మెషిన్‌లో ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది.
 
మనం సొంతంగా తయారుచేసిన ఈ దోమల నివారిణి వల్ల చాలా లాభాలున్నాయి. ఇది 100% ఆరోగ్యహితమైనది, ఎటువంటి కెమికల్స్ కలపనటువంటిది. కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది. వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది. కృత్రిమ దోమ నివారిణుల వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, కానీ మనం తయారుచేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు. పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు. ఇంకాల‌స్యం ఎందుకు మ‌స్కెటో రిపెల్ల‌ర్ రీఫిల్ చేయ‌డం మొద‌లుపెట్టండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments