Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని తాగితే...

Webdunia
గురువారం, 30 మే 2019 (20:13 IST)
చెరకు రసాన్ని పిల్లలు, పెద్దలూ తేడా లేకుండా చాలా ఇష్టపడతారు. ఇది సహజసిద్ధంగా లభించే తియ్యని రసం. వేసవిలో చెరకు రసాన్ని త్రాగడం వల్ల శరీర ఆరోగ్య రీత్యా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. చెరకు రసంలో శరీరానికి అవసరమయ్యే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బరువును నియంత్రించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. 
 
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని కొంత మంది భావిస్తారు. కానీ ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం తాగడం వల్ల ఈ జబ్బుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువగా ఉన్న ఈ చెరకు రసం బాలింతలు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
చెరకులో కాల్షియం ఉండటంతో ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రెండు పూటలా ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి త్రాగండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి, తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి చెరకురసం మంచి ఔషధం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments