Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో చెరుకు రసం తాగితే ఏం జరుగుతుంది?

వేసవిలో చెరుకు రసం తాగితే ఏం జరుగుతుంది?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (21:22 IST)
వేసవికాలంలో అద్భుతమైన రుచితో పాటు, అనేక పోషక లక్షణాలను కూడుకుని ఉన్న కారణంగా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా ఉంటుంది చెరుకురసం. ఒక గ్లాసు చెరకు రసం కేవలం మీ దప్పికను తీర్చివేయడమే కాకుండా, వేసవి తాపాన్ని సమర్థవంతంగా ఎదుర్కునే క్రమంలో మీకు తక్షణ శక్తిని అందివ్వగలుగుతుంది. చెరుకురసంలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. 
 
1. వేసవి కాలంలో తరచుగా, మన శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోవడం జరుగుతుంటుంది. క్రమంగా శరీరం డీహైడ్రేషన్ సమస్యలకు గురవ్వడం, అధిక మొత్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వేసవిలో ఈ పరిస్థితులను అధిగమించడానికి సరైన పరిష్కారంగా చెరకు రసం ఉంటుంది.
 
2. చెరుకులో ఎటువంటి కొవ్వు పదార్ధాలు ఉండవు. మరియు సహజ సిద్దమైన తీపిని కలిగి ఉంటుంది. అందువలన, ఎటువంటి అదనపు కృత్రిమ స్వీటెనర్లను జోడించనవసరం లేదు. క్రమంగా మీరు చెరకు రసం తీసుకునేటప్పుడు అధిక కొవ్వులని అందిస్తున్నామని ఆందోళన చెందనవసరం లేదు. 
 
3. చెరకులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అందుకే, బరువు తగ్గాలనుకునేవారికి సూచించదగిన పానీయంగా ఉంటుంది. ముడి చెరకు రసంలో అధికంగా 13 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుందని చెప్పబడింది.  క్రమంగా ఆహారం తక్కువగా తీసుకోవడం సాధ్యపడుతుంది కూడా. 
 
4. మీరు నిస్సత్తువ మరియు అలసటతో బాధపడుతున్న ఎడల, ఒక గ్లాసుడు చెరకు రసం మీ శక్తి స్థాయిలను తక్షణమే పునరుద్ధరించగలదు. కేవలం రోజూవారీ కార్యకలాపాలలోనే కాకుండా, వ్యాయయం తర్వాత శరీరంలో ఎలక్ట్రోలైట్స్ నింపి తక్షణ శక్తిని అందించేలా కూడా దోహదం చేస్తుంది. ముఖ్యంగా జిమ్ వెళ్ళేవారు, తరచుగా చెరకు రసం తీసుకోవడం ఎంతో ఉత్తమంగా సూచించబడుతుంది
 
5. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉన్న ఎడల, అనారోగ్యకర రీతిలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. చెరకు రసంలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు మరియు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే లక్షణాలతో కూడుకుని ఉంటుంది. క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. 
 
6. ఆరోగ్యకరమైన ప్రేవులు మరియు జీర్ణ వ్యవస్థ, బరువు తగ్గడంతో ముడిపడి ఉంటుంది. ప్రేగు కదలికలను మెరుగుపరిచేందుకు, మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు మరియు శరీరంలో ఆమ్ల తత్వాలను తగ్గించేందుకు, మరియు గుండెలో మంటను తగ్గించుటకు ఎంతగానో సహాయం చేస్తుంది. దీనికి కారణం, దీనిలో ఉండే ఫైబర్ నిక్షేపాలే. క్రమంగా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించేందుకు, ఆయుర్వేదంలో కూడా చెరకు రసాన్ని సిఫార్సు చేయడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయుర్వేదంతో చుండ్రు మాయం.. ఎలాగో తెలుసుకోవాలంటే?