Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కీరదోసతో ఎన్ని ప్రయోజనాలో..!

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:36 IST)
వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహారపదార్థాలలో కీరదోస కూడా ఒకటి. కీరదోస ఈ సీజన్‌లో బాగా దొరుకుతుంది. కీరదోసకాయలతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో కీరదోసను నిత్యం తీసుకోవాలి. దాంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు.
 
కీరదోస వల్ల కలిగే ప్రయోజనాలు:
 
* శరీరంలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు కీరదోసను తింటే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* కీరదోసకాయలను తినడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.
* అధిక బరువు ఉన్న నిత్యం కీరదోస తింటే బరువు తగ్గుతారని సైంటిస్టుల పరిశోధనలో తేలింది.
 
* వేసవిలో పలు వేడి చేసే పదార్థాలను తినడం వల్ల కొందరికి విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారు ఆ పదార్థాలను తిన్నప్పుడు కీరదోస తింటే శరీరం వేడి కాకుండా ఉంటుంది. దీంతో విరేచనాలు రాకుండా ముందస్తుగా నిరోధించవచ్చు.
* కీరదోసను అడ్డంగా చక్రాల మాదిరిగా కట్ చేసి కళ్లపై కాసేపు (20 నిమిషాలు) ఉంచుకుంటే కళ్లకు మేలు కలుగుతుంది. ఎండకు వెళ్లి వచ్చే వారు కళ్లపై కీరదోస ముక్కలను ఉంచుకుంటే కళ్లపై ఒత్తడి పడకుండా చూసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments