Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడిగుడ్డు తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Advertiesment
Health Benefits
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (22:28 IST)
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిది అన్న విషయం మనందరికీ తెలుసు. గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇంతవరకు గుడ్డు తిననివారు సైతం తినడానికి ప్రయత్నిస్తారు. గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉంటుంది. అయితే, మధుమేహం (ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్) ఉన్నవారిలోనూ గుడ్డు వల్ల గుండెజబ్బుల ముప్పు తగ్గినట్లు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
 
గుడ్డు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలపై వీరు అధ్యయనం చేశారు. వారానికి 12 గుడ్లు చొప్పున ఏడాదిపాటు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని గుర్తించారు. మూడు నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇటువంటి ఫలితాలే వెల్లడి కావడంతో పరిశోధనను పొడిగించారు. 
 
పరిశోధన ప్రారంభంలో పాల్గొన్న వారికి గరిష్ఠంగా వారానికి 12 గుడ్లు, కనిష్ఠంగా వారానికి 2 కంటే తక్కువ గుడ్లు తినాలని సూచించారు. మూడు నెలలు చివరి రోజుల్లో గుడ్లు తిన్నవారిలో హృదయరోగ సంబంధిత వ్యాధులకు కారణమైయ్యే ప్రమాద కారకాలను గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించారు. మూడునెలలపాటు వీరికి గుడ్లు అందించారు. మొదటి గ్రూపు వారికి గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. 
 
రెండో గ్రూపువారికి బరువు తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇస్తూ మొత్తం మూడు నెలలు అదనంగా ఇచ్చారు. ఇక చివరి గ్రూపువారికి మిగతా ఆరునెలలు నుంచి పన్నెండు నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినాలని సూచించారు. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గుడ్డు తినడం వల్ల కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని వారంటున్నారు. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేయసి దృష్టిలో సూపర్ మాన్‌గా ఉండిపోవాలంటే?