Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగితే...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:56 IST)
మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్ధాలను,కాయగూరలను, మనం తింటూ ఉంటాం. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది  మునగాకు. ఇది  అనేక ఆరోగ్య సమస్యలకు ఒక దివ్య ఔషదంగానే చెప్పవచ్చు.

ముఖ్యంగా మునగాకు స్టొమక్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడే వారికి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మధుమేహగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇంతే కాదు, మరెన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేసే ఈ మునగాకులోని ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం దీనిని తరచుగా ఉపయోగించటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అది ఏమిటో చూద్దాం.
 
1. అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి మునగాకు అద్బుతంగా సహాయపడుతుంది. అందుకు ఒక గుప్పెడు మునగాకును వేడినీళ్ళలో నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత, ఈ నీటిని త్రాగాలి. ఇది మీ బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది.
 
2. మునగాకులో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉండి మీ ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. అంతేకాకుండా మునగాకులో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే..... ఇది శృంగార వాంఛను పెంచుతుంది. ఇది నపుంసకత్వాన్నిపోగొట్టుటలో ఒక నేచురల్ మెడిసిన్ లాగా పని చేస్తుంది. 
 
3. మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
 
4. మునగ జిగురు ఆవు పాలలో మెత్తగా నూరి నుదురు మీద, కణతల మీద పట్టి వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. 
 
5. మునగాకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పప్పులో పెట్టుకొని వారంలో రెండు రోజులు తినటం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
 
6. మునగాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవటం వలన కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
 
7. ఒక టేబుల్ స్పూన్ మునగాకు పేస్టులో కొంచెం తేనె, కొంచెం నీటిని కలిపి ప్రతిరోజు ఖాళీ కడుపుతో త్రాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గి సన్నగా, నాజూగ్గా తయారవుతారు.
 
8. మునగాకు ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ పేస్టును ముఖానికి తరచూ రాసుకోవటం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments