Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాకర కాయ తింటే ఏమిటి?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (19:56 IST)
మనం ప్రతినిత్యం అనేక రకములైన కూరగాయలను వాడుతుంటాము. వీటన్నిటిలో అనేక రకములైన పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాయల్లో ఆకాకరకాయ ఒకటి. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవేమిటో చూద్దాం.
 
1. ఆకాకర కాయలు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి.
 
2. గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది. గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్‌ అందుతుంది.
 
3. మధుమేహంతో బాధపడే వారికి ఆ కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. 
 
4. ఆకాకరకాయను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
 
5. ఆకాకరకాయలోని విటమిన్‌ 'సి' శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 
6. దీనిలో లభించే విటమిన్‌ 'ఎ' కంటి చూపునకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments