Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయలు తింటే ఉపయోగాలు ఏమిటో తెలుసా...?

బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీ

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:30 IST)
బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా గర్భణీగా ఉన్నప్పుడు ఇవి మరీ అవసరం. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. అనేక వ్యాధుల నివారణకు పండ్లూ, కూరగాయల్లోని పీచు ఎంతో అవసరం. బెండలో పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఈ కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటుంది. 
 
బెండకాయ గింజల్లోని పదార్ధాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచిది. కాల్షియంను శోషించుకునేందుకు వీటిల్లోని ఇ విటమిన్ దోహదపడుతుంది. అయితే మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ నొప్పులూ ఉన్నవాళ్ళు వీటిల్లోని ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్ల కారణంగా తగు మోతాదులో తీసుకోవడం మంచిది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments