ఖర్జూరం పేస్ట్, నిమ్మరసం జతచేస్తే..?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (10:12 IST)
వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సూర్యరశ్మి తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ప్రతిరోజూ మనం తీసుకుంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నుండి రక్షణం లభిస్తుంది. మరి ఆ మార్పులేంటో తెలుసుకుందాం...
 
1. డ్రై ఫ్రూట్స్, వాల్‌నట్స్ వంటివి నూనెలో వేయించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్‌ను గ్లాస్ పాలలో కలిపి సేవిస్తే జీర్ణాశయ పనితీరు మెరుగుపడుతుంది. 
 
2. వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి. తద్వారా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. 
 
3. చిలగడ దుంపలోని విటమిన్ ఎ, సి కంటి ఇన్‌ఫెక్షన్స్ తగ్గిస్తాయి. అలానే ఈ దుంపలోని పీచు పదార్థం, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
 
4. చిన్ని అల్లం ముక్కను లేదా దాని రసంలో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. గొంతునొప్పిగా ఉన్నప్పుడు పాలలో కొద్దిగా అల్లం ముక్క, చక్కెర వేసి తీసుకుంటే నొప్పి కాస్త తగ్గుముఖం పడుతుంది. 
 
5. ఖర్జూరంలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి. వర్షాకాలంలో ఎదుర్కునే ఆరోగ్య సమస్యలను ఖర్జూరం నివారిస్తుంది. దీనిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. 
 
6. ఖర్జూరాన్ని పేస్ట్‌ చేసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి సేవిస్తే శరీర ఒత్తిడి, అలసట తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. 
 
7. పసుపు అందాన్ని రెంటిపు చేస్తుంది. ఇటువంటి పసుపు ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుందో చూద్దాం.. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో కొద్దిగా పసుపు, తేనె కలిపి సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

తర్వాతి కథనం
Show comments