పచ్చిమామిడి కాయను తరచుగా తీసుకుంటే? శరీరంలోని వేడిని తగ్గించుటకు?

పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొ

Webdunia
బుధవారం, 18 జులై 2018 (10:29 IST)
పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 


ఎసిడిటీ వలన ఛాతీలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటప్పుడు పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.గర్భిణులకు వాంతులు, వికారం వలన అసౌకర్యంగా ఉంటుంది. వారు పచ్చిమామిడి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

చాలామందికి మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తరువాత బద్దకంగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడిని తీసుకుంటే చురుగ్గా ఉంటారు. పచ్చిమామిడి తినడం వలన ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంటుంది. 
 
శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదపడుతుంది. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు శుభ్రపడుతాయి. పళ్ల మీద ఎనామిల్‌ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలు దూరమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments