Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో దోమలతో బాధపడుతున్నారా? విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్‌ రాసుకుంటే?

దోమలను తరిమికొట్టేందుకు మార్కెట్‌లలో అనేక ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. అయితే వీటికోసం చాలా ఖర్చు చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలున్నాయి. దోమల నుండి విముక్తి పొందేందుకు వంటింటి

Advertiesment
ఇంట్లో దోమలతో బాధపడుతున్నారా? విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్‌ రాసుకుంటే?
, మంగళవారం, 17 జులై 2018 (17:15 IST)
దోమలను తరిమికొట్టేందుకు మార్కెట్‌లలో అనేక ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. అయితే వీటికోసం చాలా ఖర్చు చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలున్నాయి. దోమల నుండి విముక్తి పొందేందుకు వంటింటి చిట్కా చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఇ క్యాప్సుల్స్ శరీరానికి ఎంతో సహాయపడుతాయి.
 
దోమలను తరిమికొట్టడంలో విటమిన్ ఈ చాలా బాగా పనిచేస్తుంది. దీనిని బాదం నూనెలో కలిపి శరీరానికి రాసుకోవడం ద్వారా దోమలు సమీపంలోకి కూడా రావు. ఈ మిశ్రమం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌‌స్ కూడా దరిచేరవు. దీనిని తయారు చేసుకునేందుకు ఖర్చుకూడా స్వల్పమే. ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లో మూడు చెంచాలా బాదం నూనెను తీసుకోవాలి.
 
ఆ నూనెలో విటమిన్ ఇ క్యాప్సుల్స్‌లో ఆయిల్‌ను వేసుకోవాలి. తరువాత దీనిని బాగా కలుపుకుని శరీరానికి రాసుకోవాలి. తద్వారా దోమలు దరిచేరవు. మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడకుండా విటమిన్ ఇ క్యాప్సుల్స్ నూనె చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలూ పరోటా తయారీ విధానం.....