Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే ఫైబర్ ఫుడ్స్

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:59 IST)
ఏది పడితే అది తిని చాలా మంది జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాదు. ఆహారం అరగడానికి మందులు వాడివాడి అలసిపోతారు. అయినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. 
 
ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్‌ని పుష్కలంగా కలిగి ఉండే కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం. పచ్చి బఠానీలు, బీన్స్ వంటి కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పచ్చి బఠానీలను నానబెట్టి ఉడికించుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. బీన్స్‌ను కూరల్లో వేసే కంటే వేపుడు చేసుకుని తింటే వాటిలోని విటమిన్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. క్యారెట్‌లో కూడా శరీరానికి అవసరమైనంత ఫైబర్ లభిస్తుంది. 
 
వంద గ్రాముల క్యారెట్స్‌లో 2.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్యారెట్‌ను పచ్చిగా తింటే మంచిది. అలానే పాలకూర, దీనిలోని విటమిన్ ఏ, బి, సి, కె, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అజీర్తిని తొలగిస్తాయి. 
 
పాలకూరను కూరగా తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు అంతగా ఇష్టపడరు. అందువల్ల దీనిని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసుకుంటే సూప్ తయారవుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments