Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి..

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (22:14 IST)
పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాకుండా సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
 
ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిలువ ఉంచుకుని, తొడలు, ఉదరం మొదలైన భాగాల్లో మర్దనా చేస్తుంటే ఆయా భాగాల్లో సంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. రొమ్ములపై గడ్డలున్న చోట మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి.
 
అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు, కలరా వ్యాధి తగ్గుతాయి. అంతేకాకుండా నీరసం, నిస్త్రాణం కూడా తగ్గుతాయి.
 
పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం