Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి....

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (19:21 IST)
తులసి ఆకులు, బెరడు.... తులసి విత్తనాలు, ఇలా ఒకటేమిటి తులసి చెట్టుతో ఎన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. తులసి ఆకులను కషాయంగా చేసిగానీ లేదంటే తులసి ఆకులను డైరెక్టుగా తీసుకున్నట్లయితే పలు అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. అవేమిటో చూద్దాం.
 
1. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
 
2. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
 
3. తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 
4. జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
 
5. కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
 
6. తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
 
7. తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
 
8. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
 
9. తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. 
 
10. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

Revanth Reddy:Allu Arjun కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా... ఓదార్పు ఎందుకు? (video)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments