Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే...

మెంతుల వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని అనేక రకాల ఆహార పదార్థాలు, పచ్చళ్లలోనే కాకుండా కేశాల అభివృద్ధికి, సౌందర్యలేపనంగా కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను మెంతులు నివారిస్తాయి. దీనివలన కలిగే ప్రయోజనాలు ఏ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (20:14 IST)
మెంతుల వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని అనేక రకాల ఆహార పదార్థాలు, పచ్చళ్లలోనే కాకుండా కేశాల అభివృద్ధికి, సౌందర్యలేపనంగా కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను మెంతులు నివారిస్తాయి. దీనివలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే...
 
1. రోజు రాత్రిపూట 3 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
2. శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం ముడతలు పడుతుంది. నలుపు వలయాలు ఏర్పడతాయి. వీటిని మెంతులు అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది.   
 
3. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయానే పరగడుపున ఆ నీటిని తాగితే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. 
 
4. నాలుగు చెంచాల మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తలకు పట్టించి అరగంట సేపటి తర్వాత తలస్నానం చేస్తే మెంతులలో ఉండే పొటాషియం తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.
 
5. మెంతి ఆకులకు కొన్ని తులసి ఆకులను కలిపి మెత్తగా పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీద మచ్చలు, మెుటిమలు తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments