Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజీర్ణం... కడుపు, గొంతు, ఛాతీలో మంట... ఈ చిట్కాలు...

జీర్ణశక్తి లోపించిన వారికి వాంతులు అవుతుంటాయి. అందువల్ల జీర్ణశక్తిని పెంచడానికే కాకుండా, వాంతులు తగ్గడానికి కూడా వైద్య చికిత్సలు తీసుకోవాలి. నిజానికి ఈ సమస్యలు చాలావరకు గృహ వైద్యంతోనే తగ్గిపోయే అవకాశం వుంది.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (20:49 IST)
జీర్ణశక్తి లోపించిన వారికి వాంతులు అవుతుంటాయి. అందువల్ల జీర్ణశక్తిని పెంచడానికే కాకుండా, వాంతులు తగ్గడానికి కూడా వైద్య చికిత్సలు తీసుకోవాలి. నిజానికి ఈ సమస్యలు చాలావరకు గృహ వైద్యంతోనే తగ్గిపోయే అవకాశం వుంది.
 
1. ధనియాలు, శొంఠి ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసిన కషాయం సేవిస్తే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి. ఉత్తరేణి వేరును నూరి నీటిలో కలిపి తాగినా ఈ సమస్యలు తొలగిపోతాయి.
 
2. భోజనం చేసిన వెంటనే కడుపు, ఛాతీ, గొంతు భాగాల్లో మంటగా అనిపించేవారు, ద్రాక్షను, కరక్కాయ చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. లేత ముల్లంగి కషాయాన్ని, పిప్పలి చూర్ణంతో కలిపి తాగితే, అజీర్తి సమస్యలు తగ్గి, ఆకలి పెరుగుతుంది. 
 
3. అజీర్తి కారణంగా అతిగా దాహం వేయడం, వాంతి, వికారాలు కూడా వుంటే లవంగ కషాయాన్ని గానీ, జాజికాయ కషాయాన్ని గానీ తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తే వాంతి సమస్య చాలా త్వరితంగా తగ్గిపోతుంది. 
 
4. ఎండు రావి చెక్కను బాగా కాల్చి ఆ బూడిదను నీటిలో వేసి, ఆ నీటిని వడగట్టి తాగితే వాంతులు తగ్గుతాయి. మారేడు చెక్క, తిప్ప తీగె ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుని కషాయం కాచి తేనెతో తాగినా మంచి ఫలితం వుంటుంది. 
 
5. కానుక గింజల్లోని పప్పును కొంచెం వేయించి ముక్కలుగా కోసి, అప్పుడప్పుడు తింటూ వుంటే వాంతులు తగ్గుతాయి. ప్రతిరోజూ భోజనానికి ముందు అల్లం, సైంధవ లవణం కలిపి తీసుకుంటే అసలు ఈ సమస్య రాకుండా నిరోధించే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments