బరువు తగ్గాలంటే.. రోజుకో గుడ్డు తినండి..
బరువును తగ్గించడంలో అవిసె విత్తనాలు భేష్‌గా పనిచేస్తాయి. అవిసె విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్‌లు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. ఒమేగా-3
బరువును తగ్గించడంలో అవిసె విత్తనాలు భేష్‌గా పనిచేస్తాయి. అవిసె విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్‌లు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. ఒమేగా-3ఫాటీ యాసిడ్‌లు పంచదారపై ఆసక్తిని తగ్గుతుంది. ఆకలి అంతగా వేయకపోవడం, చక్కెరపై ఆసక్తి తగ్గిపోవడం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అదేవిధంగా దానిమ్మ పండ్లు అధిక మొత్తంలో శరీరానికి కావలసిన పోషకాలుంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి. రోజుకో కోడిగుడ్డును తీసుకున్నా బరువును తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకుంటే రెండు పౌండ్ల బరువు తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు.
ఇక బరువును తగ్గించడంలో పుచ్చకాయ మెరుగ్గా పనిచేస్తుంది. పుచ్చకాయలో అధిక మొత్తం విటమిన్, మినరల్‌లను కలిగి ఉంటుంది. పుచ్చపండు తినటం వలన పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి వేయదు. తద్వారా బరువును తగ్గించుకోవచ్చు.
అలాగే గ్రీన్ టీలో ఉండే పాలీఫినాల్స్, శరీరంలో నిల్వ ఉండేట్రై-గ్లిసరైడ్‌లను కరిగిస్తాయి. అంతేకాకుండా, శరీరంలో సత్తువను పెంచి, బరువు తగ్గించుకోటానికి చేసే వ్యాయామాలను చేయటానికి తగిన శక్తిని సమకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.