Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి ప్రతిరోజూ తీసుకుంటే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (19:32 IST)
పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి రెండింటినీ ఆహార పదార్థాలలో వాడుతుంటారు. కొబ్బరిని అధిక మోతాదులో తినరాదు. కొబ్బరి దగ్గు, నెమ్ము ఆయాసాలను కలిగిస్తాయి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి చాలా పనిచేస్తుంది. వేడిని కలిగిస్తుంది. ఐతే కొబ్బరి వీర్యవృద్ధిని, శృంగార శక్తిని పెంచుతుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దాహాన్ని తగ్గిస్తుంది. తేలికగా అరుగుతుంది. కొంచెం మలబద్థకాన్ని కలిగిస్తుంది.
 
గర్భిణీ స్త్రీలు వారానికి 2-3 రోజులు 3 ఔన్సుల కొబ్బరి కల్లును త్రాగితే పుట్టబోవు పిల్లలు ఎర్రగా, తెల్లగా పుడతారని ఆయుర్వేదం చెపుతోంది. వేడి శరీరం గల వారికి నరములకు బలాన్నిస్తుంది. మూత్ర సంచిలోని వాతమును నొప్పిని తగ్గించును. కాక పెట్టడం, బొడ్డు సెగ చేయుట మొదలగు వానిని తగ్గించును.
 
లేత కొబ్బరి కాయలోని నీరు, వాంతిని పోగొడుతుంది. పైత్యమును తగ్గిస్తుంది. క్రిములను చంపుతుంది. ముదిరిన కొబ్బరికాయ నీరు దగ్గు, కళ్ళెను పెంచుతుంది. లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి ప్రతిరోజూ చిన్నపిల్లలకు తినిపిస్తుంటే మంచి బలమైన ఆహార పదార్థముగా పనిచేస్తుంది. 
 
కొబ్బరిపాలు, బొప్పాయి పాలు, కొంచెం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక స్పూను తింటుంటే దగ్గు, విరేచనములు తగ్గుతాయి. ఉదయం పూట ఒక గ్లాసు కొబ్బరి పాలు త్రాగి తదుపరి నాలుగు గంట లాగి ఒక చెంచా ఆముదం త్రాగితే కడుపులో నున్న బద్దెపురుగులు పడిపోతాయి. ఎండు కొబ్బరిలో కొంచెం పంచదార కలిపి తింటుంటే ప్రేగులలోనున్న కురుపులు మానిపోతాయి. మీగడలాంటి లేత కొబ్బరిని ప్రతిరోజూ ముఖంపైన వేసి రుద్దుతుంటే మొటిమలు తగ్గి ముఖం నునుపు దేలుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments