అరటికాయ తీసుకుంటే బరువు తగ్గుతారని చెప్తుంటారు. అలాగని దీనిని పచ్చిగా తీసుకోలేము. కాబట్టి అరటికాయతో కబాబ్ తయారుచేసుకుని తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడితింటారు. మరి ఆ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
అరటికాయలు - 4
పచ్చిమిర్చి - 2
అల్లం పేస్ట్ - 1 స్పూన్
జీలకర్ర పొడి - అరస్పూన్
కొత్తిమీర - 1 కట్ట
నిమ్మరసం - 1 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా అరటికాయలు కుక్కర్లో వేసి అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తరువాత పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి. ఈ తురుములో జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. రెండు వైపులా కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కబాబ్‌లను కాల్చుకోవాలి. అంతే... వేడివేడి అరటికాయతో కబాబ్ రెడీ.