స్లిమ్‌గా మారాలంటే నల్ల మిరియాలు తీసుకోవాలి, ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (22:25 IST)
మిరియాలు మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వలన అవి క్యాలరీలు బర్న్ చేసి కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. 
 
సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతిరోజూ ఉదయాన్నే ఒకటి రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. ఇలా చేయడం వలన శరీరంలోని మెటబాలిడం క్రమబద్ధం అవుతుంది. అంతేకాదు.. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెంపొందించి శరీరంలో కొత్త ఫ్యాట్ సెల్స్‌ను తగ్గిస్తాయి. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను డైట్‌లో చేరిస్తే మంచిది. 
 
రోజూ తినే వెజిటేబుల్ సలాడ్స్‌పైన ఈ నల్ల మిరియాల పొడిని చల్లాలి. దీని వలన సలాడ్ రుచితో పాటు ఆరోగ్యం బాగుంటుంది. చల్లదనం కోసం చేసే మజ్జిగపైన పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా ఈ మిరియాల పొడి చిలకరించి తాగితే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ మిరియాల పొడిని టీలో కూడా వేసుకుని తాగొచ్చు. 
 
గ్లాస్ నీటిలో ఒక చుక్క ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నన్ను సంతోషపెట్టడం భారతదేశానికి చాలా ముఖ్యం, లేదంటే?: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

viral video మా అమ్మాయి డాక్టర్, పెళ్లి చేద్దామని అబ్బాయిల్ని చూస్తుంటే అంతా అంకుల్స్‌లా వుంటున్నారు

భార్యను లేపుకెళ్లిన వ్యక్తిని పోలీసు స్టేషను ఎదుటే నరికి చంపారు

ఏపీకి నీళ్లు కావాలి తప్ప.. రాజకీయ పోరాటాలు కాదు.. మంత్రి నిమ్మల

తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని తెరాసను బీఆర్ఎస్ చేసారు?: కవిత ఆవేదన, ఆగ్రహం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jana Nayakudu: జననాయకుడు ఎఫెక్ట్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న భగవంత్ కేసరి.. ఎలా?

క్షమించండి రాశిగారు, నేను ఆ మాట అనడం తప్పే: యాంకర్ అనసూయ

Akhil: లెనిన్ నుంచి అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే పై రొమాంటిక్ సాంగ్

ముంబైలో ప్రభాస్... రాజా సాబ్ నుంచి నాచె నాచె.. సాంగ్ లాంఛ్

Anil Sunkara: స్క్రిప్ట్‌తో వస్తేనే సినిమా చేస్తా; ఎక్కువగా వినోదాత్మక చిత్రాలే చేస్తున్నా : అనిల్ సుంకర

తర్వాతి కథనం
Show comments