Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజ్జిగలో కాకర ఆకుల రసం కలుపుకుని తాగితే?

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (20:29 IST)
కాకర కాయ. చేదుగా వుండే ఈ కాకర కాయల్లో ఔషధ గుణాలు మెండుగా వున్నాయి. కాకర రసం, కాకర కాయలను తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాకర కాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
 
రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా వుంటుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ తోడ్పడుతుంది. రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ర్పభావాలను కాకర కాయ నివారిస్తుంది. మూడు టీ స్పూన్ల కాకర ఆకుల రసాన్ని, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడపున తాగితే పైల్స్ సమస్య తగ్గిపోతుంది.
 
కాకర చెట్టు వేర్లను పేస్టులా చేసి పైల్స్ వున్నచోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకర రసం బాగా ఉపకరిస్తుంది. కాకరకాయలో జీర్ణవ్యవస్థను కాపాడే ఔషధ గుణాలున్నాయి. కడుపులోని ఏలిక పాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో, తేనెతో కలిపి తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments