Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుమ పువ్వును వేడిపాలలో కలిపి తాగితే...

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (11:39 IST)
కుంకుమపువ్వు గురించి తెలియని వారు ఉండరు. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో ధయామిన్, రైబోఫ్లెవిన్ ఉంటుంది. ఇది గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. కుంకుమపువ్వును చిటికెడు మించకుండా పాలలో కలిపి ప్రతిరోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దక సమస్య తగ్గుతుంది. ఇది గర్భవతులకు ఆకలి పుట్టేలా చేస్తుంది. కనుక గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ఎన్నో ఔషధగుణాలు కూడా ఉన్నాయి. మంచి రుచి, కమ్మని వాసన ఇవ్వటం కోసం దీనిని కొన్ని రకాల వంటకాల్లో కూడా వాడుతుంటారు. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించేవి, కడుపు పట్టేయటం వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు కుంకుమపువ్వులో సమృద్దిగా ఉన్నాయి.  
 
2. గుండె ఆరోగ్యాన్ని చక్కబరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలువల్ని కుంకుమపువ్వు తగ్గిస్తుంది.
 
3. కుంకుమపువ్వులో శరీరంలో తిరుగాడే హానికారక ఫ్రీ-ర్యాడికల్స్‌ను దెబ్బతీసే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో వాపు ఏర్పడకుండా నివారించే యాంటీ- ఇన్ఫ్లమేటరీ అంశాలు, జ్ఞాపకశక్తిని పెంచేవి కూడా కుంకుమపువ్వులో పుష్కలంగా ఉన్నాయి.
 
4. శరీరంలో వేడి ఎక్కువుగా ఉన్నవారు కుంకుమపువ్వు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
 
5. కుంకుమపువ్వును సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉపయోగిస్తారు.
 
6. కుంకుమపువ్వుని వివిధ రకాల క్యాన్సర్‌కు చికిత్సగా వాడుతుంటారు. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరచి ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
 
7. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. కుంకుమపువ్వుని వేడి పాలలో వేసుకొని తాగటం వల్ల మానసిక వత్తిడి తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments