పిల్లలు పుట్టాక మహిళల్లో పొట్ట వస్తుందా...? ఏం చేయాలి?

పిల్లలు పుట్టిన కొంతమంది మహిళల్లో పొట్ట వస్తుంది. ఈ పొట్ట తగ్గాలంటే... భోజనం తర్వాత నడవండి! అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం తర్వాత పొట్ట తగ్గలేదంటే ఆఫ్టర్ లంచ్ నడక కొనసాగించాల్సిందే. భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటా

Webdunia
సోమవారం, 4 జులై 2016 (19:55 IST)
పిల్లలు పుట్టిన కొంతమంది మహిళల్లో పొట్ట వస్తుంది. ఈ పొట్ట తగ్గాలంటే... భోజనం తర్వాత నడవండి! అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం తర్వాత పొట్ట తగ్గలేదంటే ఆఫ్టర్ లంచ్ నడక కొనసాగించాల్సిందే.  భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటారు. 
 
మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావుగంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్టతగ్గడానికి రెండింటికీ మంచిది.
 
అలాగే కొంతమంది ఉదయం, సాయంత్రం...ఇలా రెండు పూటలకు సరిపడా వంట ఉదయమే చేసేస్తారు. కానీ అలా ఉదయం చేసిన పదార్థాలు సాయంత్రానికి చల్లగా అయిపోతాయి. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 
 
కాబట్టి ఏ పూటకు ఆ పూటే తాజాగా, వేడి వేడిగా వండుకొని తినడం వల్ల అటు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా... ఇటు పొట్ట ఎత్తు కూడా తగ్గుతుంది. అలా తాజా పండ్లు కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి.
 
ఇక కూరగాయల విషయంలో ఏ సీజన్‌లో దొరికే తాజా కూరగాయల్ని ఆ సీజన్‌లో తప్పనిసరిగా తినడం మంచిది. ఇలా చేస్తే పొట్ట తగ్గుతుంది. తినే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిదని, ఇంకా వ్యాయామం తప్పకుండా చేయాలని గైనకాలజిస్టులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మార్చి 18కి తర్వాత తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు

విద్యార్థిని ప్రసవం కేసులో బిగ్ ట్విస్ట్... బంధువులను రక్షించేందుకు విద్యార్థిపై ఆరోపణ... చివరకు....

బీహార్ రాజకీయాల్లో సంచలనం : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న నితీశ్

Woman: హోలీ రంగు చల్లాడని మనవడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ.. చివరికి ఏమైంది? (video)

ఆశ్రయం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నాం.. యుద్ధాన్ని ఆపండి.. చిన్నారి కన్నీరు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saravanan: కుటుంబ పోరాటంలో ఖైదీగా మారిన కథతో శరవణన్ సినిమా లీడర్ టీజర్

Pawan: ముందుగానే పవర్ స్టార్ తుఫాన్- మార్చి 19న థియేటర్లలో 'ఉస్తాద్ భగత్ సింగ్

Balakrishna: తాజా న్యూస్... నందమూరి బాలక్రిష్ణ, మలినేని గోపీచంద్ సినిమా కథ మారిందా ?

మరోమారు ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైన సోనూసూద్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

తర్వాతి కథనం
Show comments